ఉక్రెయిన్- రష్య యుద్ధంపై భారత సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తీసుకువచ్చేలా ఆదేశించాలని కోరుతూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. విద్యార్థుల తరలింపుపై కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విద్యార్థుల్లో ఎక్కువ మంది బాలికలని.. వారంతా తీవ్రమైన చలిలో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఈ సమయంలో సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ మాట్లాడుతూ, “విద్యార్థుల పట్ల మాకు సానుభూతి ఉంది, మేము చాలా బాధగా ఉన్నాము, అయితే యుద్ధాన్ని ఆపమని రష్యా అధ్యక్షుడు పుతిన్ని ఆదేశించగలమా? అని ప్రశ్నించారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తరలించేందుకు భారత ప్రభుత్వం చేయగలిగిందంతా చేస్తోందని ఆయన అన్నారు. భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం తన పని తాను చేస్తోందని సీజేఐ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. దీనిపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సహాయం కోరింది.