ఆ గిరిజన తెగ కనుగొన్న ఆ బుల్లి పిట్ట

-

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ కమోంగ్ జిల్లా సింగ్ చుంగ్ గ్రామానికి చెందిన బుగన్ గిరిజన తెగకు, స్థానిక అటవీ శాఖ అధికారుల మధ్య చక్కటి సహాయ సహకారాలున్నాయి.

విరివూరు కలిసి 2017 లో సింగ్ చుంగ్ బుగన్ విలేజ్ కమ్యూనిటీ రిజర్వ్ మనేజ్మెంట్ కమిటీ(SBVCR) గా ఏర్పడ్డారు. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రంలో శక్తివంతమైన పక్షి గా ఉండి ఆ తర్వాత కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకొని “కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ స్పైసిస్ ” జాబితాలోకి వెళ్లిన “బుగన్ లియోసిచలా ” అనే పక్షిని కనుగొని సంరక్షణ చేయడం.

ఇక్కడి సింగ్ చుంగ్ కమ్యూనిటీ రిజర్వ్ జీవవైవిధ్యానికి పుట్టినిల్లు. 17 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఈగల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కి అనుకుని ఈ రిజర్వ్ ఉంది. కమిటీ కి చెందిన అటవీశాఖ సిబ్బంది మరియు గిరిజనులు పది మంది రోజు గస్తీ తిరుగుతూ జీవ వైవిధ్యానికి ఎటువంటి హాని జరగకుండా చూస్తుంటారు.

కమిటీ ఏర్పడ్డ కొద్దీ రోజుల్లోనే ఆ బుల్లి పిట్ట ఆనవాలు తెలుసుకొని వాటి గురించి బయట ప్రపంచానికి పరిచయం చేశారు. 1947 తర్వాత ఈ పక్షి ఆనవాలు ఎక్కడా కనపడలేదు. కానీ 1996లో బర్ద్ వాచర్ డాక్టర్ రమణ ఆత్రే దీన్ని గుర్తించారు కానీ వీటి ఆనవాలు ఎక్కడ ఉన్నాయో నిర్దిష్టంగా చెప్పలేకపోయారు. బుగన్ గిరిజనులు చేసిన కృషి కారణంగా ఇది మళ్ళీ కనిపించడంతో దాని పేరు లో బుగన్ అని చేర్చబడింది.

అలాగే కనుమరుగయ్యే దశకు చేరుకున్న ఈ జాతిని సంరక్షించినందుకు గాను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మరియు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం సంయుక్తంగా ఇచ్చే “ఇండియా బయో డైవర్సిటీ” అవార్డును వీరు అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version