విద్యార్దులకు షాక్ : పరీక్షలు రాయాల్సిందేనన్న సుప్రీం !

-

ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముందు సంవత్సరాలని ప్రమోట్ చేసినా, చివరి ఏడాది వారికి పరీక్షలు నిర్వహించాలన్న యూజీసీ నిర్ణయాన్ని సమర్థించింది సుప్రీం కోర్టు. ఇప్పటికే కాలేజీ, వర్సిటీల చివరి ఏడాది విద్యార్థులకు పరీక్షలు పెట్టాలని యూజీసీ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30లోపే పరీక్షలు నిర్వహించాలని యూజీసీ నిర్ణయం తీసుకోగా, కోర్టు కూడా అదే సూచించింది.

చివరి ఏడాది ఎగ్జామ్స్ పెట్టకుండా ప్రమోట్ చేయవద్దన్న సుప్రీం, కరోనా ఎఫెక్ట్‌తో ఇబ్బందులుంటే యూజీసీని సంప్రదించాలని పేర్కొన్నది. యూనివర్శిటీలు ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించడానికి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ జూలై 6న జారీ చేసిన సర్క్యులర్‌ కు సుప్రీం కోర్టు ఇప్పుడు రాజముద్ర వేసినట్టే. దీంతో ఇక పరీక్షలు లేవు అయినా డిగ్రీ చేతికి వస్తుందని భావించిన విద్యార్ధులు అంతా మళ్ళీ పుస్తకాలు పట్టుకోక తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version