ఆ రాష్ట్రంపై సుప్రీం కోర్ట్ ఫైర్, ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత మీరే…!

-

కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి పలు రాష్ట్రాలు తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు సోమవారం నివేదిక కోరింది. ఢిల్లీ మహారాష్ట్ర, గుజరాత్, మరియు అస్సాం అనే నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి అఫిడవిట్ కోరింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కోవిడ్ -19 పరిస్థితి మరింత దిగజారిందని వ్యాఖ్యానించింది. కరోనావైరస్ పరిస్థితిని ఎదుర్కోవటానికి అన్ని రాష్ట్రాలు తాము తీసుకున్న చర్యలు,

తీసుకోవలసిన చర్యలు మరియు కేంద్రం నుండి అవసరమైన సహాయంపై స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని సుప్రీం కోర్టు కోరింది. ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత గుజరాత్ పరిస్థితి అత్యంత చెత్తగా ఉందని, జనాలు సమీకరించే సమావేశాల మీద ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వివాహాలకు అనుమతి ఇవ్వకుండా ఉండటం మంచిది అని అభిప్రాయపడింది. వెంటనే చర్యలు చేపట్టాలని అభిప్రాయపడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version