మహారాష్ట్ర వివాదంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 55 మంది శివసేన ఎమ్మెల్యేలలో 53 మంది ఎమ్మెల్యే లకి కొత్తగా ఎన్నికైన స్పీకర్ రాహుల్ నార్వేకర్ పంపిన “అనర్హత” నోటీసులపై ఎలాంటి చర్య తీసుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు, మహారాష్ట్ర గవర్నర్ తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై విచారణ పూర్తయ్యేంతవరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్. ఉద్ధవ్ థాక్రే బృందం తరఫున కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. ఇక రేపు విచారణకు ఎమ్.ఎల్.ఏ ల అనర్హత పిటీషన్ లిస్ట్ అయింది. అయితే, రేపు సాధ్యం కాదని, ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు సమయం పడుతుందని స్పష్టం చేసిన ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ…. ఈలోగా, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలను తెలియచేయాలని ఆదేశించారు.