BREAKING : సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చేసిన పనికి ప్రశంసలు

-

హైదరాబాద్ లో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి రోజు వందలాది కొత్త వాహనాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. దీంతో, ట్రాఫిక్ సమస్యలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. అయితే.. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు దిగి ట్రాఫిక్ కంట్రోల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‭గా మారింది. జూబ్లీహిల్స్‭లో సామాన్య పౌరుడిగా నిలబడి ఆయన ట్రాఫిక్ క్లియర్ చేశారు. అది చూసిన నెటిజన్లు సామాన్య పౌరుడిగా ఆయన వ్యవహరించారని ప్రశంసిస్తున్నారు. హైదరాబాద్‭లో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. ప్రతిరోజు వందలాది కొత్త వాహనాలు రోడ్డు మీదకు రావటమే అందుకు కారణం.

ఈ క్రమంలో తాజాగా జూబ్లీహిల్స్‭లోని ఫిల్మ్ నగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ లో ఉండిపోయిన సురేశ్ బాబు తన కారు నుంచి కిందకు దిగి ట్రాఫిక్‭ను కంట్రోల్ చేశారు. వాహనదారులకు సూచనలు చేస్తూ కాసేపు ట్రాఫిక్‭ను నియంత్రణలోకి తీసుకొచ్చారు. అక్కడున్న కొందరు సురేష్ బాబు చేస్తున్న పనిని వీడియో తీసి నెట్టింట పోస్టు చేయగా వైరల్ అవుతోంది. పెద్ద నిర్మాత అయ్యుండి.. తనకేంటి అని అనుకోకుండా బాధ్యత గల పౌరుడిగా వ్యవహరించడం వాహనదారులను ఆకట్టుకుంది. ఇక రామానాయుడు స్టూడియో నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్న సురేష్ బాబు.. సినిమాల‌ను నిర్మిస్తున్నారు. ఈ మధ్య సంక్రాంతి సినిమాల పోటీపై ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. సినిమాల విషయంలో పెద్దా చిన్నా.. ఇతర భాష అనే తేడాలు లేవని కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన చెప్పారు. ఇక సురేష్ బాబు పెద్ద కుమారుడు రానా కూడా నటుడిగా ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్‭ను సొంతం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version