చాలా మంది శృంగార జీవితం బాగా ఉండాలని మంచి ఆహారం తీసుకోవడం, మందులు వాడడం వంటి పద్ధతులని ఫాలో అవుతూ వుంటారు. అయితే శృంగార జీవితం బాగా ఉండాలని అనుకుంటే ఈ వ్యాయమ పద్ధతులు కూడా బాగా ఉపయోగ పడతాయి. మరి ఎలాంటి వ్యాయమ పద్ధతులు ని పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం.
కెగెల్ ఎక్సర్‌సైజెస్ వలన శృంగారము లో ఎక్కువసేపు పాల్గొనడానికి అవుతుంది. ఇవి కేవలం ఆడవాళ్లకే కాదు మగవారిని కూడా. శృంగారము లో ఎక్కువసేపు పాల్గొనడానికి మగవాళ్ళకి కూడా ఇవి హెల్ప్ అవుతాయి. కొన్ని రకాల సమస్యలు స్త్రీ పురుషుల్లో కలగడం వలన తృప్తి లేకుండా శృంగారాన్ని చేసుకుంటారు చాలా మంది దంపతులు. కానీ శృంగారము లో ఎక్కువసేపు పాల్గొనడానికి కెగెల్ ఎక్సర్‌సైజెస్ బెస్ట్.
మొదటి వ్యాయామాన్ని చేసే పద్దతి
మొదట మీరు ఫ్రీగా కూర్చోవాలి. లేదంటే పడుకోవచ్చు కూడా. ఇప్పుడు మీరు మూత్రాశయం దగ్గర కండరాలను ఎఫెక్ట్ అయ్యేలా చెయ్యాల్సి వుంది. మూత్రం ఆపుకున్నట్లుగా గట్టిగా హోల్డ్ చేస్తుండాలి. తరవాత వదిలేయాలి. కొంచెం సేపు రిలాక్స్ గా వుండండి. 15 సాలు చొప్పున ఈ వర్కౌట్ చేయండి.
రెండవ వ్యాయామాన్ని చేసే పద్దతి
దీని కోసం మొదట మీరు నిలబడండి. మీ కాళ్ళను దూరం చేసి 5 సెకన్ల పాటు శ్వాస పీల్చుకోవాలి. ఊపిరి పీల్చుకున్నప్పుడు మూత్రాశయ కండరాలను ముందుగా చెప్పినట్లుగా కెగెల్ ఎక్సర్‌సైజ్‌లా చేయండి.