IPL SRH vs RR : టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న‌ స‌న్ రైజ‌ర్స్.. తుది జ‌ట్లు ఇవే

-

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌మ తొలి మ్యాచ్ ను నేడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుతో ఆడ‌బోతుంది. ఈ మ్యాచ్ పూణేలోని మ‌హారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. కాగ ఈ మ్యాచ్ స‌న్ రైజ‌ర్స్ పూర్తి కొత్త జ‌ట్టుతో బ‌రిలోకి దిగుతుంది. వార్న‌ర్, రషీద్ ఖాన్ తో పాటు ప‌లువురు కీల‌క ఆట‌గాళ్లు లేకుండా.. ఈ సారి స‌న్ రైజ‌ర్స్ బ‌రిలోకి దిగుతుంది. అయితే వార్న‌ర్, రషీద్ ఖాన్ వంటి కీల‌క ఆట‌గాళ్ల‌ను వేలంలో తీసుకోకుండా.. చిన్న స్థాయి ఆట‌గాళ్లును కొనుగోలు చేశార‌నే విమ‌ర్శ కూడా ఉంది.

అయితే ఈ విమ‌ర్శ‌ల‌ను కొట్టిపారాశే స‌మ‌యం వ‌చ్చింది. తొలి మ్యాచ్ లో గెలిచి స‌త్త చాటాల‌ని స‌న్ రైజ‌ర్స్ చూస్తుంది. కాగ ఈ మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ టాస్ నెగ్గింది. దీంతో కెప్టెన్ కేన్ విలియమ్స‌న్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. తుది జ‌ట్లు ఈ విధంగా ఉన్నాయి.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తుది జ‌ట్టు :
అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, కేన్ విలియమ్సన్ ( కెప్టెన్ ), నికోలస్ పూరన్ ( వికెట్ కీప‌ర్ ), ఐడెన్ మార్క్రామ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, T నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

రాజస్థాన్ రాయల్స్ తుది జ‌ట్టు :
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ ( కెప్టెన్/ వీకెట్ కీప‌ర్ ), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నాథన్ కౌల్టర్ నైల్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ

Read more RELATED
Recommended to you

Exit mobile version