సర్వే: ఆ జిల్లాలో కారుకు డ్యామేజ్..కమలం-కాంగ్రెస్ పోటాపోటి!

-

తెలంగాణలో నిదానంగా బీజేపీ హవా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది..ఆ పార్టీ కేవలం రాజకీయంగానే దూకుడుగా ఉండటం కాదు…అసెంబ్లీ స్థానాల్లో కూడా దూకుడుగా ఉంటూ..అక్కడ బలం పెంచుకుంటుంది. ఏదో పైకి రాజకీయం చేసిన బీజేపీకి క్షేత్ర స్థాయిలో బలం లేదనే వాదన ఎక్కువ ఉంది..ఇప్పుడు ఆ వాదన నిజం కాదని నిరూపించే ప్రయత్నంలో బీజేపీ ఉంది…తమ బలం పెరుగుతుందని చూపించాలని అనుకుంటుంది.

ఇదే క్రమంలో టీఆర్ఎస్ హవా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా రాజకీయం మారిపోతుందని తెలుస్తోంది…2019 పార్లమెంట్ ఎన్నికల నుంచే ఇక్కడ రాజకీయం పూర్తిగా మారిపోయింది…ఎప్పుడైతే ఆదిలాబాద్ ఎంపీ సీటు బీజేపీ గెలుచుకుందో అప్పటినుంచి రాజకీయం మారింది. ఇప్పుడు ఇంకా ఎక్కువగా మారిందని ఇటీవల పీకే టీం చేస్తున్న సర్వేలో తేలిందట. ఇక్కడ 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో ఐదింటిలో ప్రతికూల ఫలితాలు వచ్చాయని విశ్వసనీయ సమాచారం. ఖానాపూర్, బోథ్,ఆసిఫాబాద్ తో పాటు మంచిర్యాల, ముథోల్లో కారుకు ప్రతికూల వపనాలు వీస్తున్నట్టు పీకే టీం గుర్తించిందని తెలిసింది.

ఇక జిల్లాలో కమలం హవా పెరిగిందని తెలుస్తోంది.. ముథోల్ ,బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో బీజేపీ, ఆసిఫాబాద్, మంచిర్యాల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయని తెలుస్తోంది. ఒక్క చెన్నూరులో మాత్రమే టీఆర్ఎస్‌కు అనుకూలత కనిపిస్తుందట. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కాస్త పాజిటివ్ వాతావరణం ఉంది..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈయనకే గెలిచే అవకాశాలు ఉన్నాయి.

ఇక నిర్మల్‌లో కాస్త కాంగ్రెస్‌కు ఎడ్జ్ కనిపిస్తుండగా, ఆదిలాబాద్ సిర్పూర్, బెల్లం పల్లి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టి ఫైట్ జరిగేలా ఉందని తెలుస్తోంది. అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 10 సీట్లలో మూడు కమలం, మూడు కాంగ్రెస్, ఒకటి టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉండగా, మిగిలిన మూడు సీట్లలో టఫ్ ఫైట్ నడిచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఆదిలాబాద్ లో కారుకు డ్యామేజ్ అయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version