మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా తో తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సొంత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్నిత 8 ఓవర్లలో వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ అలవొకగా చేదించింది.
16 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది టీం ఇండియా. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో 50 పరుగులు పూర్తి చేసుకున్న సూర్య కుమార్ యాదవ్ ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు అంటే 732 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
శిఖర్ ధావన్ 689 పరుగులు మరియు విరాట్ కోహ్లీ 641 పరుగులు రికార్డులను బ్రేక్ చేశాడు. అంతే కాకుండా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సులు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2021లో రిజ్వాన్ 42 సిక్సులు, గప్ టిల్ 41 సిక్సర్లు కొట్టారు. ఇక ఈ ఏడాది 45 సిక్సులు కొట్టి.. సూర్య తన విశ్వ రూపం చూపించాడు.