సుశాంత్ సింగ్ ది ఒక్క రూపాయి కూడా వాడుకోలేదు: రియా చక్రవర్తి

-

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంకు సంబంధించి దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి. తాజాగా ఈడీ అతని ప్రేయసి రియా చక్రవర్తి ని విచారిస్తుంది. ఈ నేపధ్యంలో ఆమె ఈడీ విచారణలో కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నుంచి తాను ఎప్పుడూ డబ్బును దొంగ తనం చేయలేదు అని ఆమె స్పష్టం చేసింది. తన సొంత ఆదాయం నుంచి ప్రతి ఒక్క ఖర్చుకి సంబంధించి చెల్లించానని చెప్పింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నిధులను అపహరించారనే ఆరోపణలకు సంబంధించి రియా తన స్టేట్‌మెంట్‌ను ఎనిమిది గంటలకు పైగా ఈడీ అధికారుల వద్ద సమర్పించింది. తనపై వస్తున్న అన్ని ఆరోపణలను ఆమె ఖండించింది. అతని ఖాతా నుంచి… 15 కోట్లు తీసుకున్నాను అనే కృష్ణ కిషోర్ సింగ్ ఆరోపణల్లో వాస్తవం లేదని సుశాంత్ తండ్రి ఆరోపణలు ఆమె ఖండించింది. తనకు ఉన్న మూడు కంపెనీల్లో ఎక్కడా కూడా రూపాయి కూడా ఖర్చు చేయలేదు అని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version