సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ చివరి సినిమా టీజర్…. మిస్ యూ సుశాంత్…!

-

గత నెల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన చివరిసారిగా నటించిన సినిమా ‘’దిల్ బెచారా’’ షూటింగ్ పూర్తి అయినప్పటికీ లాక్ డౌన్ అమలులో ఉండటంతో విడుదల అవ్వలేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మిత్రుడు ముఖేష్‌ చబ్రా ఈ సినిమాని డైరెక్ట్  చేశాడు. కాగా ఈ సినిమానుండి ఓ అప్ డేట్ వచ్చింది రేపు ఆ సినిమా యొక్క టీజర్ ను రిలీజ్ చేస్తునట్టుగా చిత్రా బృందం తెలియజేసింది. సినిమాలో కథానాయికగా నటించిన సంజనా సంఘీ తన ఇంస్టా లో ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ రేపు టీజర్ ను రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. సుశాంత్ ను చాలా మిస్ అవుతునట్టుగా ఆమె పేర్కొన్నారు.

sushanth singh rajput last film dil bechara to be realesd on hotstar soon

కాగా ఈ సినిమా జాన్ గ్రీన్ రాసిన ‘ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’ నవల ఆధారంగా చిత్రీకరించారు. సినిమాను సుశాంత్ సన్నిహితుడు ముకేష్ చబ్రా డైరెక్ట్ చేయగా కథానాయికగా సంజన సంఘీ నటించింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించాడు సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ సినిమా రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది కాగా సినిమాను ఈ నెల 24 న ఓ‌టి‌టి లో రిలీజ్ చేస్తునట్టుగా వాళ్ళు వెల్లడించారు. సినిమాను సుశాంత్ సింగ్ కు ట్రిబ్యూట్ గా ప్రతీ ఒక్కరికీ ఫ్రీ గా చూసే అవకాశాన్ని సంస్థ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version