అవంతిని వెంటాడుతోన్న గుర్తు తెలియని వ్యక్తులు ?

-

ప్రేమ పెళ్లి చేసుకున్నారని కోపంతో అవంతి రెడ్డి తల్లితండ్రులు హేమంత్ అనే యువకుడిని చంపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే 25 మంది ప్రమేయం ఉందని తేల్చిన పోలీసులు, 21 మంది అరెస్ట్ చేసి మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. అలానే అవంతితో పాటు హేమంత్ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు గచ్చి బౌలి పోలీసులు. నిందితుల మరోసారి కష్టడీకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.

అయితే అవంతికి పోలీస్ లు రక్షణ కలిపించాలని, గుర్తు తెలియని వ్యక్తులు అవంతి ని ఫాలో అవుతున్నారని అవంతి తరపు న్యాయవాది దిలీప్ పేర్కొన్నారు. హేమంత్ ఆస్తికలు కలిపేందుకు కుటుంబసభ్యులు విజయవాడ వెళితే అక్కడ కూడా ఆమెను వెంబడించారని ఆయన ఆరోపించారు. అవంతి తండ్రి, మేనామామలు ఇద్దరు కరుడుగట్టిన నేరగాళ్లన్న ఆయన వారి నుంచి అవంతి కి ముప్పు ఉందని అన్నారు. పోలీస్ లు రక్షణ కలిపించకుంటే కోర్ట్ కు వెళుతామన్న ఆయన ఈ కేసులో నిందితులకి శిక్ష పడే దాకా ఊరుకోనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version