ఎంతో మంది పాదాల వాపుల తో ఇబ్బంది పడుతుంటారు. అయితే మరి ఈ సమస్య నుండి ఎలా బయట పడాలి..? ఈ సమస్య ప్రమాదమా లేదా ..? ఇలా ఎన్నో విషయాలు మీకోసం. మరి ఇంక ఆలస్యం ఎందుకు ఇప్పుడే తెలుసుకోండి. పాదాల వాపుకు అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ సేపు కూర్చున్న లేదా నిలబడటం వల్ల కూడా వస్తాయి. ఏది ఏమైనా వీటిని తగ్గించడం కొంచెం కష్టమే.
ఇది ఇలా ఉంటె ఆకలి తగ్గడం, బరువు పెరగడం, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది కలగడం, చర్మం రంగు మారడం కనుక జరిగితే పాదాల్లో వాపు ఎక్కువ అయి ఈ బాధ తీవ్రంగా ఉంటె ఇవి వస్తాయి. ఎప్పుడైనా పరిస్థితి తీవ్రంగా ఉంటె డాక్టర్ ని సంప్రదించండి. పాదాలను కొంచెం ఎత్తులో ఉంచి కూర్చోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అలానే కాలి కింది భాగం లో తల దిండు పెట్టుకోవడం లాంటివి చేస్తే మంచిది.