‘ సైరా ‘ ట్రైల‌ర్ రివ్యూ… చిరు న‌ట‌నా విశ్వ‌రూపం అరాచ‌కం… అంత‌కుమించే

-

ప్రస్తుతం సినీ సినీ అభిమానుల్లో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్ర ఫీవర్ నెలకొని ఉంది. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానులు ఎంతో ఉత్క‌ఠ‌తో వెయిట్ చేస్తోన్న సైరా నరసింహారెడ్డి ట్రైలర్ విడుదలైంది. రు.  250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ఆధారంగా నిర్మించారు.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. రామ్‌చరణ్ నిర్మాతగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఇప్పుడు ట్రైలర్ రూపంలో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైల‌ర్‌లో సినిమాలో న‌టిస్తోన్న ప్ర‌తి ఒక్క‌రి మెయిన్ క్యారెక్ట‌ర్లు రివీల్ చేశారు. న‌య‌న‌తార ప్ర‌ధాన హీరోయిన్ కాగా, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, త‌మ‌న్నా అంద‌రూ న‌టించారు. ట్రైల‌ర్‌లో ప్ర‌తి ఒక్క‌రి క్యారెక్ట‌ర్ రివీల్ అయ్యింది.


ఆరు ప‌దుల వ‌య‌స్సులోనూ చిరంజీవి చేసిన విరోచిత విన్యాసాలే హైలెట్‌గా సైరా ట్రైల‌ర్ క‌ట్ అయ్యింది. చిరు విరోచిత న‌ట‌నా విశ్వ‌రూపం అంత‌కుమించి అన్న‌ట్టుగా ఉంది. ఇక డైలాగులు చూస్తే భార‌త‌మాత‌కు జై – న‌ర‌సింహారెడ్డి సామాన్యుడు కాదు…అత‌డు కార‌ణ‌జ‌న్ముడు – అత‌డొక యోధుడు.. అత‌డిని ఎవ్వ‌రూ ఆప‌లేరు – ఈ భూమిమీద పుట్టింది మేం… ఈ మ‌ట్టిలో క‌లిసేది మేం.. మీకు ఎందుకు క‌ట్టాలిరా శిశ్తు –
స్వాతంత్య్రం కోసం జ‌రుగుతున్న తొలి యుద్ధం ఇది… ఈ గెలుపులో నువ్వు గెల‌వాలి –
స్వేచ్ఛ కోసం ప్ర‌జ‌లు చేస్తోన్న తిరుగుబాటు… మా దేశం వ‌దిలి వెళ్లిపోండి… లేదా యుద్ధ‌మే ఇలా ప్ర‌తి ఒక్క‌టి బాగా పేలింది.

ఏదేమైనా ట్రైల‌ర్‌తోనే సైరా ద‌మ్మేంటో చెప్పేసింది. ఇక సెప్టెంబ‌ర్ 2న చిరు క్రియేట్ చేసే రికార్డులు, థియేట‌ర్ల‌లో అరుపులు, కేక‌ల‌కు సైరా అభిమానులు గెట్ రెడీ…!

Read more RELATED
Recommended to you

Exit mobile version