ఆప్ఘనిస్తాన్ తో నేడు భారత్ కీలకపోరు

-

టీ20 పురుషుల ప్రపంచ కప్ లో నేడు భారత్, ఆప్ఘనిస్తాన్ తో తలపడనుంది. అబుదాబి వేదికగా నేడు మ్యాచ్ జరుగనుంది. వరసగా విఫలమవుతూ వస్తున్న భారత్ కు ఆప్ఘన్ తో పోరు కీలకం కానుంది. టోర్నీ ప్రారంభం అయినప్పటి నుంచి వరసగా పాకిస్థాన్, న్యూజీలాండ్ మ్యాచుల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో భారత్ కు ప్రస్తుతం గెలుపు కావాల్సి ఉంది. కాగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమవుతూ వస్తున్న భారత్ ఈ మ్యాచులో చెలరేగి ఆడితేనే పరువు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే మరోవైపు ఆప్ఘనిస్తాన్ ను తక్కువ అంచానా వేసే వీలు లేదు. ఆజట్టు గత మ్యాచులో పాకిస్థాన్ జట్టును ఓడించినంత పనిచేసింది. పాక్ బ్యాటర్ ఆసిఫ్ అలీ చెలరేగి ఆడక పోతే ఆప్ఘనిస్తాన్ గెలిచేదేమో.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో ఆ జట్టు అగ్రశ్రేణి జట్లకు తీసిపోని విధంగా ఉంది. మరోవైపు తీవ్ర వరస ఓటములతో భారత జట్టు మానసికంగా దెబ్బతిని ఉంది. గత రెండు మ్యాచుల్లో ఓపెనర్లు దారుణంగా విఫలమవడం, మిడిల్ ఆర్డర్ కూడా అనుకున్నంతగా రాణించకపోవడంతో భారత్ రాణించలేకపోయింది.

భారత్ లీగ్ దశ నుంచి నిష్క్రమించవద్దంటే.. ఆప్ఘనిస్థాన్ పై ఏకపక్షంగా భారీ విజయం సాధించడంతో పాటు.. రానున్న మ్యాచుల్లో కూడా భారీ విజయం సాధించాలి. అదే విధంగా మిగతా జట్ల గెలపోటములు సెమిస్ అవకాశాలను ప్రభావితం చేస్తాయి. అన్ని సమీకరణాలు భారత్ కు అనుకూలంగా ఉంటే సెమీస్ వెళ్లే అవకాశం ఉంటుంది.

జట్ల వివరాలు ( అంచనా)

భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, రాహుల్, ఇషాన్‌/సూర్యకుమార్,పంత్, హార్దిక్, జడేజా, శార్దుల్, షమీ, బుమ్రా, వరుణ్‌.  

అఫ్గానిస్తాన్‌: నబీ (కెప్టెన్‌), హజ్రతుల్లా, షహజాద్, రహ్మానుల్లా, హష్మతుల్లా/ఉస్మాన్, నజీబుల్లా, గుల్బదిన్, రషీద్, ముజీబ్, నవీన్, హసన్‌.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version