ఆ హీరోయిన్ల వల్లే నాకు అవ‌కాశాలు రాలేదు.. తాప్సీ ఆవేద‌న‌..!!

-

హీరోయిన్ తాప్సీ పన్ను.. ఝుమ్మందినాదం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయిన సంగ‌తి తెలిసిందే. ఫస్ట్ మూవీలోనే తన గ్లామర్‌తో యూత్ తనవైపుకు తిప్పుకుంది. ఈ మూవీలో హీరో మనోజ్‌తో తాప్సీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసింది. అయితే ఏ సినిమా పెద్దగా గుర్తింపును తీసుకరాలేదు. ఈ క్ర‌మంలోనే తాప్సీ.. ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మర్చేశారు. అక్కడ కథకు, పాత్రకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ హీరోయిన్‌గా తనకుంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్లలో తాను ఒక్కరిగా ఉన్నారు. ఇక ఒకవైపు వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ, మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ లైమ్‌లైట్‌లో ఉండే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటి. తాజాగా తాప్సీ నటించిన `తప్పడ్` సినిమా విడుదలై ప్రశంసలు దక్కించుకుంది. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తాప్సీ బాలీవుడ్‌లో బంధుప్రీతిపై హాట్ కామెంట్స్‌ చేసింది.

`నేనూ నెపోటిజమ్ బాధితురాలినే. నాకు రావాల్సిన చాలా అవకాశాలను కొంతమంది స్టార్‌ల వారసురాళ్లు తన్నుకెళ్లిపోయారు. నాతో పోల్చుకుంటే వారు నటనలో ప్రతిభావంతులు కారు. కానీ, వారసత్వమే వారికున్న అర్హత. వారి కారణంగా నేను చాలా పాత్రలను కోల్పోయాన`ని తాప్సీ ఆవేద‌న బ‌య‌ట‌పెట్ట‌డంతో.. ప్ర‌స్తుతం తాప్సీ కామెంట్స్‌ హాట్ టాపిక్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version