సీనియర్ హీరోయిన్ టబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను పెళ్లి చేసుకోక పోవడానికి కారణం ఒక బాలీవుడ్ హీరోనే అని చెప్పింది. అంతే కాకుండా ఆ హీరో పేరు కూడా ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచారు. అతను ఎవరో కాదు బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవగన్. అతని వల్లే ప్రస్తుతం సింగిల్ గా ఉన్నా నని చెప్పి అందరి ని ఆశ్చర్య పరిచారు.
అజయ్ దేవగన్ తన సోదరుడి స్నేహితుడని అన్నారు. చిన్నప్పటి నుంచి అజయ్ దేవగన్ చాలా చనువు గా ఉండే దాన్ని అని తెలిపారు. తానె ఎవరైన అబ్బాయిలతో మాట్లాడితే అజయ్ దేవగన్ కోపం వచ్చేదని తెలిపారు. అంతే కాకుండా వారిని కొట్టడానికి కూడా ముందుకు వచ్చే వాడని తెలిపింది. అయితే బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ టబు ను పెళ్లి చేసుకోలేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ను అజయ్ దేవగన్ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అజయ్ దేవగన్ బాలీవుడ్ లో వరుసగా సినిమా లు చేస్తున్నాడు.