తైవాన్ పైకి మళ్లీ చైనా యుద్ద విమానాలు.. మరోసారి ఉద్రిక్తత

-

చైనా, తైవాన్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. తాజాగా మరోసారి చైనా యుద్దవిమానాలు తైవాన్ గగనతలంలోకి చొరబడ్డాయి.  ఇటీవల కొన్ని రోజుల ముందు ఇలానే చైనా తన ఏయిర్ ఫోర్స్ ను పంపి ఉద్రిక్తతలను పెంచింది. తాజాగా యుఎస్ చట్టసభ సభ్యుల తైపీ పర్యటన కారణంగా చైనా
8 సైనిక విమానాలను తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి పంపింది అని స్థానిక మీడియా శుక్రవారం తెలిపింది. గత నెల అక్టోబర్ 1న చైనా జాతీయ దినోత్సవం సందర్భంగా రికార్డు స్థాయిలో 38 చైనా సైనిక విమానాలు తైవాన్‌ గగలతలాన్ని ఉల్లంఘించాయి.

ఇటీవల కాలంలో వన్ చైనా విధానానికి కట్టుబడి ఉండాలంటూ చైనా ఇతర దేశాలను హెచ్చిరిస్తూ ఉంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, చైానా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య వర్చువల్ గా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా చైనా తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాకు కూడా వార్నింగ్ ఇచ్చింది. తైవాన్ పై తన ఆధిక్యతను ప్రదర్శించడానికి చైనా ఇటీవల బలప్రయోగం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version