వినికిడి శక్తి పెరగాలంటే వీటిని తీసుకోండి..!

-

ఈమధ్య కాలంలో అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువైపోయాయి. వివిధ రకాల సమస్యలతో అందరూ బాధ పడుతున్నారు. ఎక్కువ మంది ఎదురుకునే సమస్యలలో వినికిడి లోపం కూడా ఒకటి. వినికిడి శక్తి పెరగడానికి ఇలా అనుసరిస్తే సరిపోతుంది. మరి వినికిడి శక్తిని ఎలా పెంచుకోవాలి..? ఏ విధంగా వినికిడి శక్తిని పెంచుకోవచ్చు అనే విషయాలని ఇప్పుడు చూద్దాం. వీటిని కచ్చితంగా డైట్ లో తీసుకుంటే ఏ బాధ ఉండదు.

 

అరటి పండ్లు

అరటి పండ్లు ని డైట్ లో చేర్చుకుంటే వినికిడి శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే పొటాషియం వినికిడి శక్తిని రెట్టింపు చేయడానికి హెల్ప్ అవుతుంది.

బ్రోకలీ

బ్రోకలీ లో విటమిన్ సి ఉంటుంది అలానే ఫ్రీ రాడికల్స్ ని ఏర్పడకుండా చూస్తుంది. చెవి ఆరోగ్యానికి కూడా బ్రోకలీ హెల్ప్ అవుతుంది.

చిక్కుడు

చిక్కుడు జాతికి చెందిన ఏ ఆహార పదార్థాలను తీసుకున్న సరే వినికిడి శక్తి పెరుగుతుంది రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

చేపలు

చేపల్ని తీసుకుంటే కూడా వినికిడి శక్తి పెరుగుతుంది చేపలలో మెగా ఒమేగా త్రి ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి విటమిన్ డి ని కూడా మనం పొందవచ్చు.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ కూడా వినికిడి శక్తిని పెంచుతుంది యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. దీనిలో వుండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. వినికిడి శక్తిని పెంచేందుకు చిరుధాన్యాలు వెల్లుల్లి కూడా హెల్ప్ అవుతాయి కాబట్టి వీటిని కూడా డైట్లో చేర్చుకుంటూ ఉండండి దానితో ఆరోగ్యం బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version