తలాపునే గోదావరి.. కాంగ్రెస్ పాలనలో గుక్కెడు నీటి కోసం అరిగోస : ఎమ్మెల్సీ కవిత

-

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అధికార పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. వేసవి రాకముందే గోదావరి ఎండిపోయిన తీరును ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తలాపునే గోదావరి పారుతున్నా..గుక్కెడు నీటి కోసం మళ్లీ అరిగోస పడే రోజులను కాంగ్రెస్ సర్కార్ ‘గ్యారెంటీ’గా తెచ్చిందని కవిత విమర్శించారు.

 


పెద్దపల్లి జిల్లా కోల్‌బెల్ట్ వంతెన వద్ధ ఎండిపోయిన గోదావరి నది చిత్రాన్ని కవిత సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు.బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు వంద కిలోమీటర్ల పొడవునా గోదావరిని సజీవ జలధారగా మార్చిందని ఆమె గుర్తుచేశారు. మండే ఎండల్లోనూ సుందిళ్ల బ్యారేజీ బ్యాక్ వాటర్ గోదావరిని నిండు కుండలా కలకళలాడేలా చేసిందన్నారు.గుక్కెడు నీటి కోసం మళ్లీ అరిగోస పడే రోజులను కాంగ్రెస్ ప్రభుత్వం ‘గ్యారెంటీ’గా తెచ్చిందని కవిత విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version