వంద నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రణ గురించి ఆర్బిఐ తో మాట్లాడుతున్నాం: పురందేశ్వరి

-

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి కావడంతో అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు తరలివస్తున్నారు. ఈ తెల్లవారుజామునే ఎన్టీఆర్ మనవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుమార్తెలు, కుమారులు ఇతర కుటుంబసభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని నివాళులర్పించారు.

నందమూరి రామకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. నందమూరి తారకరామారావు ఒక సంచలనం.. ప్రబంజనం అన్నారు. నేటి నుంచి వచ్చే ఏడాది 28 వరకు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని 12 కేంద్రాల్లో ఈ ఉత్సవాలను జరిపి.. అన్ని రంగాల్లో నిష్ణాతులైన వారిని సత్కరిస్తామని తెలిపారు. వంద రూపాయల నాణెం పై ఎన్టీఆర్ బొమ్మ ముద్రణ గురించి ఆర్బిఐ తో మాట్లాడుతున్నట్లు ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version