ఆ వార్తల్లో నిజం లేదు.. తమన్నా క్లారిటీ

-

నందమూరి బాలకృష్ణ ఈ యేడాది సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి మూవీతో మంచి సక్సెస్‌ను అందుకున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో తమన్నా ఓ ఐటెం సాంగ్ చేయనున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ విషయమై తమన్నా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. తనకు బాలయ్య సర్​, అనిల్​ రావిపూడిపై ఎంతో గౌరవం ఉందని తెలిపింది. వారి సినిమా కోసం తనను ఒప్పించాల్సిన అవసరం లేదని, ఆ టీంలో పనిచేయడాన్ని తానెంతో ఎంజాయ్​ చేస్తానని తెలిపింది. అయితే, తాను ఐటెం సాంగ్​ చేస్తున్నట్టుగా తప్పుడు వార్తలు రాయడం తనను బాధించిందని తెలిపింది. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె మెగాస్టార్ హీరోగా వస్తన్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version