కోవిడ్ ఎఫెక్ట్ : వర్చువల్ గా షాప్ ఓపెనింగ్ చేసిన తమన్నా !

-

కరోనా జీవితాలన్నిటినీ మార్చేసింది. ఇప్పటికే దీని వలన చాలా మంది వర్క్ ఫ్రం హోంలు చేస్తున్నారు. మరి కొందరికి అయితే ఉద్యోగాలే లేకుండా పోయాయి. కానీ సినిమా వాళ్ళు ఏమో ఎప్పుడెప్పుడు షూటింగ్ లు మొదలు పెడదామా అన్నట్టు ఉన్నారు. తాజాగా ఒక ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. అదేంటంటే తెలంగాణాలోని ఖమ్మం నగరంలో మలబార్ గోల్డ్ షాప్ బ్రాంచ్ ప్రారంభం అయింది. దానిని హీరోయిన్ తమన్నా భాటియా ఓపెన్ చేసింది.

అయితే ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా ? ఆమె ఓపెన్ చేసింది నేరుగా కాదు, వర్చువల్ గా. కోవిడ్ నేపథ్యంలో వర్చువల్ విధానంలో తమన్నా మలబార్ గోల్డ్ షాప్ బ్రాంచ్ ఓపెనింగ్ చేసింది. ఆమె వస్తే జనాన్ని కంట్రోల్ చేయడం కష్టం అని, ఒకవేళ అలా చేస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు పెడతారని భావించిన యాజమాన్యం ఇలా ప్లాన్ చేసిందన్న మాట. తెలంగాణలో 13వ మలబార్ గోల్డ్ షాప్ ఓపెనింగ్ చేయడంపై మలబార్ గోల్డ్ ఇండియా ఆపరేషన్ ఎండీ ఓ. ఆషర్ హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version