నిర్మాతలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న హీరోయిన్ తమన్నా.. అసలు ఈమెకి ఏమైంది?

-

సౌత్ ఇండియా లో గత దశాబ్ద కాలం నుండి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి తమన్నా.. అందం తో పాటు అద్భుతమైన నటన మరియు ఇతర హీరోయిన్స్ కి సాధ్యపడని అద్భుతమైన డాన్స్ టాలెంట్ తమన్నా సొంతం.. అందుకే ఎంత మంది కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీ కి వచ్చినా ఆమె క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు.. కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చెయ్యడం.. నెగటివ్ రోల్స్ సైతం ఒప్పుకొని చెయ్యడం తమన్నా ప్రత్యేకత.. గత కొంత కాలం క్రితం నితిన్ హీరో గా నటించిన మాస్ట్రో సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకులను భయపెట్టేసింది.. ఇక ఇటీవలే విడుదలైన F3 సినిమాలో అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.. ఇలా వరుసగా వుబ్బినమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ లో ఇప్పటికి టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది.. అయితే తమన్నా ప్రవర్తన లో ఇటీవల కాలం లో చాలా మార్పులు వచ్చాయంటున్నారు దర్శక నిర్మాతలు.

ఇక అసలు విషయానికి వస్తే తమన్నా తన ఇన్ని సంవత్సరాల సినీ కెరీర్ లో ఏనాడు కూడా సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ప్రొమోషన్స్ లో పాల్గొనకుండా ఉండలేదు.. చిన్న సినిమా పెద్దన సినిమా అని తేడా లేకుండా థియేటర్స్ లో విడుదలయ్యే వరుకు ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటూ ఉండేది.. కానీ F3 సినిమా సమయం లో ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తో షూటింగ్ సమయం లో ఏర్పడిన చిన్న గొడవ వల్ల ఆ సినిమా ప్రొమోషన్స్ మొత్తానికి ఎగ్గొట్టేసింది.. కనీసం ఈమె సక్సెస్ మీట్స్ లో కూడా పాల్గొనకపోవడం అప్పట్లో పెద్ద చర్చ కి దారి తీసింది.. ఇప్పుడు కూడా ఆమె తన తదుపరి చిత్రం ప్రొమోషన్స్ విషయం లో అలాగే చేస్తుందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.. సత్యదేవ్ హీరో గా నటంచిన లేటెస్ట్ చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది.. ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఎట్టకేలకు విడుదలకు మోక్షం లభించింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికోసం తమన్నా అక్షరాలా 1 కోటి 50 లక్షల రూపాయిలు పారితోషికం తీసుకుందట.. ఇంత భారీ మొత్తం రెమ్యూనరేషన్ తీసుకున్న కూడా ఈమె ప్రొమోషన్స్ లో పాల్గొనట్లేదని ఆ చిత్ర నిర్మాత వాపోతున్నాడట.. అసలే సినిమా విడుదల ఆలస్యం అయ్యి ఫైనాన్సియల్ గా చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆ నిర్మాత పరిస్థితి ఇప్పుడు చెప్పుకోలేని విధంగా తయారైనట్టు తెలుస్తుంది.. మరి తమన్నా లో అకస్మాతుగా ఈ మార్పు ఏమిటి అనేది ఇండస్ట్రీ పెద్దలకు కూడా అంతు చిక్కని ప్రశ్న లాగా మిగిలిపోయింది.. ఆమె ప్రొమోషన్స్ కి నో చెప్పేంత గొడవలు F3 షూటింగ్ సెట్స్ లో ఏమి జరిగి ఉంటుంది అంటూ ఆరాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు.. ప్రస్తుతం తమన్నా మెగాటర్ చిరంజీవి హీరో గా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version