రోజు రోజుకు దేశంలో టొమాటో ఫ్లూ విజృంభిస్తోంది. తమిళనాడు తర్వాత ఒడిశాలో కూడా చాలా మంది చిన్నారులు ఈ టొమాటో ఫ్లూ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని చిన్నారుల్లో వచ్చే ఫ్లూ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు అధికారులు. జ్వరపీడితులు, జ్వరం ఎక్కువగా ఉన్న పిల్లలకు రక్తపరీక్షలు, ఇతర పరీక్షలు కూడా ఆసుపత్రుల్లోనే చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో టమోటా ఫ్లూ వ్యాపిస్తుంది.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలకు ఇది త్వరగా సోకుతుందని నిపునులు చెబుతున్నారు. టొమాటో ఫ్లూ అంటు వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో దీని కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ సమయంలో పిల్లలు జ్వరంతో బాధపడుతున్నట్లయితే, వారికి సొంతంగా మందులు ఇవ్వకుండా వైద్యులను సంప్రదించండం మంచిదంటున్నారు.