డైరెక్టర్ కష్టాలు…! లాక్ డౌన్ వల్లా కిరాణా షాపులో పని చేస్తూ…

-

dirctor anandh
dirctor anandh

కరోనా మహమ్మారి ఎఫెక్ట్ మనుషుల ప్రాణాల పైనే కాదు మనుషుల పొట్ట పై కూడా కొడుతుంది..! ఆర్థిక రంగాన్ని చిన్నాబిన్నం చేస్తుంది. ఎవ్వరి దగ్గర డబ్బు లేదు.. కుటుంబ బాధ్యతలు భుజాలపై పడటంతో తోచిందల్లా చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మొన్న ఆంధ్రప్రదేశ్ లో కొందరు టీచర్లు తోపుడు బ్యాండ్లపై కూరగాయలు అమ్ముటూ కనిపించారు ఇప్పుడు తమిళనాడు లో ఓ ప్రముఖ సినీ దర్శకుడు కిరాణా షాపు నిర్వహిస్తు కనపడ్డాడు.

‘ఓరు మజాయ్ నాంగు సారాల్’ , మౌనా మజాయణ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. సినిమా ప‌నులు మొద‌లు కాక‌పోవ‌డంతో పొట్ట‌కూటి కోసం చిన్న కిరాణాషాపు పెట్టుకున్నాడు. చెన్నైలో క‌రోనా ప‌రిస్థితి తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో కేవ‌లం కిరాణా షాపుల‌కి మాత్ర‌మే ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చింది. ఈ నేప‌థ్యంలో చెన్నైలోని మౌలివాక్కంలో ఫ్రెండ్ కు చెందిన ఓ షట్టర్ కిరాయికి తీసుకొని కిరాణ షాపు పెట్టుకున్నాడు ఆనంద్‌. ప్రస్తుతం ఆయ‌న‌ తునింతు సీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version