తమిళనాడు రైలు ప్రమాదం.. కేంద్రంపై రాహుల్ సీరియస్

-

తమిళనాడు రాష్ట్రంలో గతరాత్రి చోటు చేసుకున్న భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. మైసూర్-దర్భంగా రైలు ప్రమాదం, గతేడాది ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్‌లో గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీ కొట్టిన ఘటనకు అద్దం పడుతోందన్నారు. రైలు ప్రమాదాల ఘటనలు పెరుగుతున్నా.. వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా కేంద్ర ప్రభుత్వం గుణపాఠాలు నేర్వడం లేదన్నారు.

జవాబుదారీతనం పై స్థాయి నుంచే ఉండాలని కేంద్రంపై రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్రం మేల్కోవడానికి ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ఇదిలాఉండగా, భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలును ఢీకొంది.ఈ ప్రమాదంలో 13 కోచ్‌లు పట్టాలు తప్పాయి. కొన్ని చెల్లాచెదురుగా పడిపోగా, మరికొన్ని ఒకదాని పైకి మరొకటి ఎక్కాయి.ఈ ప్రమాదంలో 19 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version