లోటస్‌పాండ్ వద్ద కలకలం.. రోడ్డుపై అర్ధనగ్నంగా పడియున్న యువతి

-

హైదరాబాద్ మహానగరంలోని ఏపీ మాజీ సీఎం జగన్ నివాసం లోటస్ పాండ్ వద్ద ఓ యువతి అర్ధనగ్నంగా దర్శనమిచ్చింది. బట్టలు సగం చిరిగి రోడ్డుపై పడిపోయి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు 108 అంబులెన్సును పిలిపించి అందులో యువతిని ఆస్పత్రికి తరలించారు.

అయితే, యువతి పరిస్థితిని బట్టి చూస్తే ఆమెపై లైంగికదాడి జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలాఉండగా, యువతి మద్యం తాగి హైదరాబాద్-జూబ్లీహిల్స్ పరిధిలోని లోటస్ పాండ్ వద్ద మత్తులో రోడ్డుపై పడి ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం యువతిపై అత్యాచారం జరిగిందా? లేదా కేవలం మద్యం మత్తులో అలా పడిపోయిందా? అనేది తెలియాల్సి ఉన్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version