రిలీజ్‌కు ముందే ఆ సినిమా చూసిన సీఎం..మూవీ టీమ్‌పై ప్రశంసల వర్షం

-

తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయ నిధి స్టాలిన్ నటించిన తాజా చిత్రం ‘నెంజుకు నీది’. ఇది బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఆర్టికల్ 15’కు అఫీషియల్ తమిళ్ రీమేక్. కాగా, తమిళ్ వర్షన్ కు అరుణ్ రాజా కామరాజ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 20న సినిమా విడుదల కానుంది. కాగా, విడుదలకు ముందే ఈ చిత్రాన్ని చూశారు తమిళనాడు సీఎం.

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేశారు. తమిళనాడు సీఎం స్పెషల్ గా ఈ సినిమా చూశారు. అనంతరం మూవీ యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఇందులో ఉదయనిధి స్టాలిన్ కు జోడీగా టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక నటించింది.

సొసైటీలో వేళ్లూనుకుపోయిన కులవ్యవస్థను ప్రశ్నించే నేపథ్యంలో సినిమా స్టోరి ఉండగా, చక్కటి కథాంశాన్ని ఈ సినిమాలో తమిళ్ నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 20న సినిమా విడుదల కానుంది. ఒరిజినల్ హిందీ ఫిల్మ్ ‘ఆర్టికల్ 15’ లో హీరోగా బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version