గతంలో కోర్టుల మీద వివాదాస్పద కామెంట్స్ చేసిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఇప్పుడు మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోర్టుల తీర్పులు భరించలేక జనం ఏదో ఒక రోజు ఉద్యమిస్తే కోర్టులకి తెలుసోస్తుందని అన్నారు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టలు ఇవ్వకుండా అడ్డుకుంటే పేదలు ఊరుకుంటారా అని తమ్మినేని ఈ సంధర్భంగా ప్రశ్నించారు. సీఎం జగన్ ఎందుకో మౌనం వహిస్తున్నారని ఆ మౌనం బద్ధలైతే ప్రళయం వస్తుందని ఆయన అన్నారు.
అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దన్న ఆయన ప్రజాస్వామ్యంలో అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకుంటే మూల్యం చెల్లిస్తారని తమ్మినేని పేర్కోన్నారు. గతంలో కూడా ప్రభుత్వ పాలసీలలో కోర్టుల జోక్యం దారుణమని.. ఇది ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబడడమే అని అభిప్రాయపడ్డారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఇక ఎన్నికలు ఎందుకు ? ఎమ్మెల్యేలు కావడం ఎందుకు.. కోర్టులే ఆపమని అంటుంటే.. ఇక ఈ వ్యవస్థలు ఎందుకు అని ఆయన వివాదాస్పద కామెంట్స్ చేశారు. తమ నిర్ణయాలు తప్పైతే గెలిపించిన ప్రజలే మళ్లీ ఓడిస్తారని ఆయన అన్నారు.