హైదరాబాద్ డ్రగ్స్ కి సంబంధించి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐకి ఎక్సైజ్ శాఖ రిప్లై ఇచ్చింది. గత రెండేళ్లలో 12 డ్రగ్స్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. 12 కేసుల్లో 8 కేసుల్లోనే చార్జిషీట్ దాఖలు చేసారు ఎక్సైజ్‌శాఖ అధికారులు. టాలీవుడ్‌కు సంబంధించిన 4 కేసులపై సమాచారం ఇవ్వలేదు. ఎక్సైజ్‌శాఖ దాఖలుచేసిన 8 చార్జిషీట్లలో సంచలన అంశాలు ఉన్నాయి.
డ్రగ్స్ దందా దేశాలు కూడా దాటింది. జర్మనీ, బ్రిటన్, ఇంగ్లాండ్‌ల నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. విదేశాలనుంచి వచ్చే స్టీల్‌బౌల్స్ పేరుతో కొకైన్, ఎల్ఎస్డీ తీసుకొచ్చారు. www.ipsld.lo వెబ్సైట్ ద్వారా స్టూడెంట్స్ డ్రగ్స్ బుకింగ్ చేసుకున్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ మహేశ్వర ఫార్మాలో సైతం డ్రగ్స్ ఈజీగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఎనిమిది చార్జిషీట్లలో కాలేజీ స్టూడెంట్స్‌తో పాటు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. సంచలనం సృష్టించిన టాలీవుడ్ కేసులో 72 మంది పేర్లు ఉన్నాయి.