వైర‌ల్ అవుతున్న తార‌క్ వాచ్.. ధ‌ర ఎంతంటే?

-

ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ విడుద‌ల చేసిన అనంత‌రం చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో అంద‌రి క‌ళ్లు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేతి కి ఉన్న ఖ‌రీదైన వాచ్ పై ప‌డింది. తారక్ ధ‌రించిన వాచ్ ధ‌ర ఎంత అని గుగూల్ తెగ సెర్చ్ చేస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా తార‌క్ ఖ‌రీదు అయిన వాచ్ పై పెద్ద గా నే చ‌ర్చ న‌డుస్తుంది. అయితే సాధార‌ణం గా సెల‌బ్రెటీలు ఖ‌రీదైన వ‌స్తువులు వాడ‌టం కామ‌న్ అయితే.. తార‌క్ వాచ్ చూసి మాత్రం అంద‌రూ ముక్కున వేలు వెసుకుంటున్నారు.

అస‌లు ఎందుకు సోష‌ల్ మీడియా లో ఇంత ర‌చ్చ చేస్తున్నారంటే.. ఈ వాచ్ ధ‌ర ప్ర‌స్తుతం ఆన్ లైన్ లో రూ. 3,99,32,392 ఉంది. రిచార్డ్ మిలే అని కంపెనీ కి చెందిన వాచ్. ఈ అంటే దాదాపు నాలుగు కోట్లు అన్న‌ట్టు. ఇంత డ‌బ్బు తో దాదాపు ప‌ది కుటుంబాలు హాయ్ గా బ‌తికేస్తాయి. అందుకే తార‌క్ వాచ్ పై ఇంత ర‌చ్చ న‌డుస్తుంది. అయితే తార‌క్ ఇప్ప‌టి కే అత్యంత ఖ‌రీదు అయిన లంబోర్గిని అనే కారు ను కూడా వాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version