‘TARGET Chandrababu ‘ మొదలైంది ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చాలా విషయాలలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాల లో జోక్యం చేసుకోవటం తగ్గించింది. చంద్రబాబు హయాంలో మాదిరిగా కాకుండా జగన్ తీసుకున్న నిర్ణయాలకు దాదాపు ఓకే చెబుతోంది. ఇందు మూలంగానే ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు విషయంలో తామేమీ చేయలేమని అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని ఇటీవల కేంద్రం చెప్పుకొచ్చింది.

ఇటువంటి తరుణంలో గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ పై దారుణమైన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి పార్టీ  నీ ఆంధ్ర రాష్ట్ర ద్రోహుల పార్టీగా చంద్రబాబు చిత్రీకరించి మోడీ పై దారుణమైన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంతో తాజాగా కేంద్రం చంద్రబాబు ని టార్గెట్ చేసినట్లు జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి. దీంతో ప్రస్తుతం కేంద్రంలో ఫుల్ మెజార్టీతో అధికారంలో ఉన్న బిజెపి చంద్రబాబు ని టార్గెట్ గా చేసుకుని కేంద్రం ఐటీ దాడుల బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

ఈ ప్లాన్ లో భాగంగానే ఇటీవల ఐటీ దాడులు దక్షిణాదిలో ప్రముఖ సినిమా యాక్టర్ లను రాజకీయ నేతలను టార్గెట్ గా చేసుకుని సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే తాజాగా చంద్రబాబు కి సంబంధించి సన్నిహితులు  మరియు ఆయనకు దగ్గరగా పనిచేసిన సంబంధించిన అధికారులను లక్ష్యంగా చేసుకుని కేంద్రం ఐటి దాడులు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి 2019 ఎన్నికల ముందు పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేసిన శ్రీనివాస చౌదరిపై ఐటీ దాడులు నిర్వహించగా దాదాపు 150 కోట్లకు పైగా ఆస్తులు బయట పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ దాడుల్లో చంద్రబాబు ని ఏదో రకంగా జైల్లో కి పంపించడానికి కేంద్రం గట్టిగా కంకణం కట్టుకుందని ఇందువల్లనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులపై ఐటీ దాడులు గట్టిగా జరుగుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version