ఒకప్పుడు లవర్ బాయ్ కాని ఇప్పుడా హీరోతో సినిమాలు తియ్యడానికి ప్రొడ్యూసర్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. తరుణ్‌తో చిన్న సినిమా తీసినా పెట్టుబడి తిరిగి వస్తుందా అని సందేహిస్తున్నారు నిర్మాతలు. అందుకే ఈ హీరోతో సినిమాలు తియ్యడానికి నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దీంతో తరుణ్ కెరీర్ క్లైమాక్స్‌కి వచ్చేసింది. బయటివాళ్లెవరూ సినిమాలు తియ్యట్లేదని, సొంత కంపెనీ పెట్టుకుంటున్నాడట తరుణ్.
కెరీర్ బిగినింగ్‌లో సూపర్ హిట్స్ కొట్టిన తరుణ్‌కి ఆ తర్వాత అన్నీ ఫ్లాపులే వచ్చాయి. పదేళ్ల నుంచి ఎంత కష్టపడినా సక్సెస్ మాత్రం రాట్లేదు. దీంతో తరుణ్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఇక రెండేళ్ల క్రితం వచ్చిన “ఇది నా లవ్‌స్టోరీ’ తర్వాత మళ్లీ సినిమా చెయ్యలేదు. అయితే ఇప్పుడు కెరీర్‌ని కాపాడుకోవడానికి ప్రొడ్యూసర్‌గా మారుతున్నాడట తరుణ్.
తరుణ్ ప్రొడ్యూసర్‌గా మారుతున్నాడని, మూడు ప్రాజెక్టులు లైన్‌లో పెట్టాడని ప్రచారం జరుగుతోంది. వీటిల్లో రెండు వెబ్ ఫిల్మ్స్, ఒకటి థియేట్రికల్ మూవీ అని తెలుస్తోంది. అయితే తరుణ్ మళ్లీ జనాలముందుకొస్తే, ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా.. రిసీవ్ చేసుకోకపోతే ఇన్నాళ్లు సేవ్ చేసుకున్న డబ్బులు కూడా ఖర్చై పోతాయని కామెంట్ చేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.