ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటర్స్ దూసుకుపోతోంది. టాటా నుంచి వరసగా ఈవీ కార్లు వస్తున్నాయి. ముఖ్యంగా టాటా తీసుకువచ్చిని ‘నెక్సాన్ ఈవీ సూపర్ క్లిక్ అయింది. దీంతో పాటు ‘టిగోర్ ఈవీ’ని కూడా టాటా తీసుకువచ్చింది. ఎలక్ట్రిక్ కార్లలో టాటాకు ఎంజీ పోటీ ఇస్తోంది. ఎంజీ నుంచి ఇప్పటికే ‘జెడ్ఎస్ ఈవీ’ వచ్చింది. టాటా నెక్సాన్ కు పోటీ ఇస్తోంది.
టాటా ప్రస్తుతం లాంగ్ రేంజ్ ఇచ్చే ఈవీలపై నజర్ పెట్టింది. టాటా నుంచి త్వరలో 5 ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయి. టాటా కర్వ్ అనే మిడ్ సైజ్ ఎస్ యూవీ ని మార్కెట్ లోకి తీసుకురానున్నారు.