టాటా ఇన్నోవేషన్ ఫెలోషిప్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలోని బయోటెక్నాలజీ
విభాగం టాటా ఇన్నోవేషన్ ఫెలోషిప్ కి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పర్యావరణం ఇతర అనుబంధ రంగాల్లో ప్రధాన సమస్యలకు వినూత్న పరిష్కారాలను కనుగొనేందుకు ఈ ఫెలో షిప్ ని తీసుకు వచ్చారు.
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు డీబీటీ అధికారిక వెబ్ సైట్ లో అప్లికేషన్ నింపి సబ్మిట్ చేయాలి. ఇది ఇలా ఉంటే బయోలాజికల్ సైన్సెస్ లేదా బయోటెక్నాలజీలో అత్యుత్తమ ట్రాక్ రికార్డ్ ఉన్న శాస్త్రవేత్తలకి రివార్డ్ ఇస్తారు. ఈ ఫెలోషిప్ ప్రోగ్రాంకు అర్హత పొందితే నెలకు రూ.25 వేల నగదుతో పాటు అదనంగా ఇనిస్టిట్యూట్ నుంచి సాధారణ వేతనం లభిస్తుంది.
వార్షిక నిధి కింద రూ. 6 లక్షలను కూడా ఇస్తారు. నవంబరు 30 లోపు దరఖాస్తులను పంపించాలి. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు డీబీటీ అధికారిక వెబ్ సైట్ లో అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చెయ్యాలి. నిర్దేశించిన ప్రోఫార్మాలోని అప్లికేషన్ సాఫ్ట్ కాపీని తప్పనిసరిగా DBT ePromis పోర్టల్ లో పెట్టాలి.
డా.డియో ప్రకాష్ చతుర్వేది, సైంటిస్ట్-C, రూమ్ నెంబరు 814, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఫ్లోర్, బ్లాక్-2, CGO కాంప్లెక్స్, లోధి రోడ్, న్యూఢిల్లీ -110003 అనే చిరునామాకు ఒక హార్డ్ కాపీని నవంబరు 30లోపు పంపాలి. http://www.dbtepromis.gov.in లేదా http://www.dbtepromis.nic.in ద్వారా అప్లికేషన్ ని పొందండి.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే విజయపథం.కామ్ వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి.