రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన గురించి దాదాపు అందరికీ తెలిసిందే. భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ పై లగచర్ల, రోటిబండ గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో 16 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు పోలీసులు. కాగా ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సురేష్ నేడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దాడి జరిగిన రోజు నుంచి సురేష్ పరారీలో ఉండగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే అనూహ్యంగా నేడు వికారాబాద్ పోలీసుల ఎదుట సురేష్ స్వయంగా లొంగిపోయాడు. సురేష్ కోసం వారం రోజులుగా గాలించారు. దీంతో పోలీసులు సురేష్ ను కోడంగల్ కోర్టులో హాజరు పరిచారు. సురేష్ కు 14 రోజుల రిమాండ్ విదించింది కోర్టు. సురేష్ ను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు.