ఐటీ సర్వీసులు, కన్సల్టింగ్, బిజినెస్ సొల్యూషన్స్‌లో ప్రపంచంలోని పెద్ద కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2021వ సంవత్సరానికి గాను ఫ్రెషర్స్ నుంచి ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులు ఈ టీసీఎస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ప్రదర్శనను లెక్కిస్తారు. అనంతరం వారి పెర్ఫార్మెన్స్ స్కోరును బట్టి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.
టీసీఎస్ ఉద్యోగాల కోసం బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ చదివిన వారు దరఖాస్తు చేయవచ్చు. పార్ట్‌టైమ్, కరస్పాండెన్స్ కోర్సులు చదివిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. ఎన్ఐఓఎస్ నుంచి సెకండరీ లేదా సీనియర్ సెకండరీ కోర్సులను చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 10, 12, డిప్లొమా (అర్హత ఉంటే), యూజీ, పీజీలలో కనీసం 60 శాతం మార్కులను సాధించి ఉండాలి. ప్రతి సబ్జెక్టులో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థి నైపుణ్యాలను లెక్కిస్తారు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారికి అకాడమిక్ ఇయర్స్ మధ్య గ్యాప్ 2 ఏళ్లకు మించరాదు. అప్లై చేసే సమయంలో ఇలాంటి గ్యాప్స్ లేదా బ్యాక్‌లాగ్స్ ఉంటే కచ్చితంగా తెలియజేయాలి. అందుకు సంబంధించిన పత్రాలను జతపరచాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లలో సర్టిఫికెట్లు ఉంటే వాటిని బోనస్‌గా పరిగణిస్తారు. కేవలం ఒక యాక్టివ్ బ్యాక్ లాగ్ మాత్రమే ఉండాలి. అభ్యర్థి వయస్సు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులకు వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటే అది 3 ఏళ్లకు మించకూడదు. మరిన్ని వివరాలకు టీసీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.