టీడీపీ తో పొత్తుకు బీజేపి రెఢీ ?

-

టీడీపీ అధినేత చంద్రబాబు ఎగిరి గంతేసే వార్త చెప్పేందుకు బిజెపి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీతో పొత్తు కోసం చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. అసలు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన కూడా కేంద్రం చేయడం లేదని, ఆ పార్టీతో కలిసేది లేదని ఆ పార్టీ నాయకులంతా పదేపదే చెబుతున్నా, బాబు మాత్రం అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బిజెపి అండతో తెలుగుదేశం పార్టీని గట్టెక్కించాలని అధికార పార్టీ వైసీపీ దూకుడును తగ్గించాలని చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినా ఫలితం కనిపించలేదు. తెలుగుదేశం పార్టీని కాదని జనసేన పార్టీ తో ఏపీలో బీజేపీ పొత్తు పెట్టుకుంది. క్రమక్రమంగా ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీని బలహీనం చేయాలనే ఉద్దేశంతో, ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుంటూ వైసీపీ ప్రభుత్వానికి పరోక్షంగా సహకరిస్తూ వస్తోంది.


ఇప్పుడు మాత్రం బిజెపి నాయకులు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే తమకు కలిసి వస్తుందనే అభిప్రాయంతో ఉన్నారు. ఇలా అనుకుంటుంది ఏపీ బీజేపీ నేతలు మాత్రం కాదు. తెలంగాణ బిజెపి నాయకులు. తెలంగాణలో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్, ఓటుబ్యాంకు ఉండడంతో, ఆ స్థానం దక్కించుకోవాలని చూస్తున్నా, ఫలితం కనిపించడం లేదు. ఇక జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో తెలంగాణలో పవన్ అభిమానులంతా బిజెపి వైపు మొగ్గు చూపుతారని బిజెపి అంచనా వేస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో నాయకుల కొరత ఉన్నా, పార్టీ కేడర్ మాత్రం బలంగా ఉంది.

నియోజకవర్గాల్లో టీడీపీ ఓటు బ్యాంకు చెక్కుచెదరకపోవడంతో తెలుగుదేశం పార్టీతో తెలంగాణ వరకు పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందనే విషయంపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆలోచిస్తున్నారు. ఇదే విషయమై టీడీపీ నాయకుడు గరికపాటి మోహన్ రావు తో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విషయంలో రాకపోయినా, కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం పొత్తు విషయంలో అంత సుముఖంగా లేనట్టుగా తెలుస్తోంది. బండి సంజయ్ మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మంచిదనే అభిప్రాయంలో ఉండడంతో పాటు, ఈ విషయంలో కేంద్రం పెద్దలను సైతం ఒప్పించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తెలంగాణాలో బీజేపీ టీడీపీ పొత్తు అంటూ సెట్ అయితే క్రమంగా ఏపీలోనూ పొత్తు చిగురించే అవకాశం ఉంటుందని బాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version