ఆ రెండు పార్టీలు RSS ముక్కలే.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

-

ఏఐఎంఐఎం  చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ  మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆప్, బీజేపీ రెండూ ఆర్ఎస్ఎస్ లో
భాగమేనంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు సైద్ధాంతికంగా ఒకటేనని, రెండు పార్టీలకు ఆర్ఎస్ఎస్ సాయపడుతుందని అన్నారు. ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి భేదం లేదని, రెండూ హిందుత్వాన్నే  నమ్ముతాయని వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆప్లను ఆర్ఎస్ఎస్ సృష్టించిందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ కేవలం బీజేపీకి మాత్రమే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీకి సైతం తల్లిలా
వ్యవహరిస్తోందని ఓవైసీ ఆరోపించారు. తద్వారా ముస్లిం మైనారిటీ ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఇటు ఆప్, అటు బీజేపీలను ఒవైసీ ఏకకాలంలో విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.


ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ సర్కారు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు కలిసి నగరంలోని చెత్తనంతా తీసుకొచ్చి ముస్లింలు నివసించే ప్రాంతాల్లో విసిరేస్తున్నారని మండిపడ్డారు. అయితే రానున్న ఢిల్లీ ఎన్నికల్లో  తాము కూడా పోటీ చేస్తున్నట్టు శనివారం
అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీని, అటు ఆప్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version