పేటీఏం ‘వర్మ’..కుల చిచ్చు..వైసీపీ స్క్రిప్ట్!

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..రాజకీయాల్లో కూడా వివాదాలు రేపుతున్నట్లే కనిపిస్తున్నారు. ఏపీలో అధికార వైసీపీకి పరోక్షంగా అండదండలు అందిస్తూ…ప్రతిపక్ష పార్టీలని దెబ్బకొట్టడంలో తన పాత్ర పోషిస్తున్నారు. ఒక న్యూట్రల్ వ్యక్తిగా ఉన్నప్పుడు..ఏదైనా రాజకీయ అంశంపై రెండువైపులా ఆలోచించాలి. కానీ వర్మ వన్ సైడ్‌గా వైసీపీకి అనుకూలంగా వెళ్లిపోతున్నారనే విషయం గత ఎన్నికల ముందే రుజువైంది. టీడీపీని దెబ్బతీయడం కోసం వర్మ ఏ విధంగా వైసీపీ కోసం పనిచేశారో అందరికీ తెలిసిందే.

ఇక ఇటీవల వర్మ సీఎం జగన్‌ని కలవడం, ఆ తర్వాత రాజకీయాలపై వ్యూహం అనే సినిమాకు ప్లాన్ చేయడం..అలాగే ఇటీవల పరిణామాలపై టీడీపీ-జనసేనలపై విమర్శలు చేయడం చూస్తుంటే..వర్మ పక్కాగా వైసీపీ స్క్రిప్ట్‌ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కందుకూరు, గుంటూరు చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. ఈ ఘటనల్లో తప్పు ఎవరిది అనేది తేల్చలేని పరిస్తితి. ఇక వీటిపై ఎవరి వర్షన్ వారికి ఉంది.

కానీ దీనిపై వర్మ స్పందిస్తూ…ప్రచారం కోసమే చంద్రబాబు..ప్రజల ప్రాణాలని తీశారని, ఇదంతా బాబు కుట్ర అని, బాబు నర హంతకుడు అంటూ సేమ్ వైసీపీ నేతలు ఏవైతే విమర్శలు చేశారో అవే చేశారు. తాజాగా బాబు-పవన్ కలయికపై కూడా స్పందిస్తూ..”    కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు” అంటూ ట్వీట్ చేశారు. అంటే కమ్మ-కాపు కులాల మధ్య చిచ్చు పెట్టేలా ట్వీట్ చేసరు.

ఇది కూడా వైసీపీ నేతలు చేసే విమర్శలే. అందుకే వర్మకు టీడీపీ-జనసేన శ్రేణులు స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తున్నాయి. జగన్ వేసే పేటీఏం డబ్బులకు వర్మ ఆశపడి..వైసీపీ స్క్రిప్ట్ ఫాలో అవుతూ, టీడీపీ-జనసేనల మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అయితే గత ఎన్నికల ముందు వర్మ ట్రాప్ లో పడ్డారు గాని..ఈ సారి మాత్రం పడేలా లేరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version