రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రభుత్వం నీరుగార్చింది : అశోక్‌ బాబు

-

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా ఆ పార్టీ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చిపెట్టే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సచివాలయాలకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టం అని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడైనా ఇంత విడ్డూరం ఉందా అని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సచివాలయ సిబ్బందికి అప్పగించిన ప్రభుత్వం… పారదర్శకంగా, పకడ్బందీగా జరగాల్సిన పనిని అపహాస్యంగా మార్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతోందని అశోక్ బాబు విమర్శించారు.

రిజిస్ట్రేషన్లు సచివాలయాల్లో జరుగుతాయన్న ప్రభుత్వం నిర్ణయం మొత్తం రిజిస్ట్రేషన్ల వ్యవస్థనే నీరుగార్చిందని అన్నారు. వ్యవస్థల్లో జగన్ రెడ్డి జోక్యం పరాకాష్టకు చేరిందని, మైనింగ్, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖల వంటి ఆదాయార్జన శాఖలను కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ల అంశంలో ప్రభుత్వం తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త రిజిస్ట్రేషన్ విధానానికి సంబంధించిన పూర్తి సమాచారంతో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

“జగన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజా రాజధాని అమరావతిపై తన రాజకీయ కుట్రల పడగ విప్పాడో అప్పటినుంచే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయానికి గండిపడింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయి, భూముల క్రయవిక్రయాలు మందగించాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దారుణంగా పడిపోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు కూడా కొంతవరకు దోహదం చేశాయి” అని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version