చంద్రబాబు మంగళవారం కబుర్లు.. వినరేంది తమ్ముళ్లు!

-

కబుర్లుచెప్పేవాడికేం తెలుస్తుంది నొప్పి.. కథనరంగంలోకి దిగేవాడికి కదా తెలిసేది అన్న రేంజ్ లో ఆఫ్ ద రికార్డ్ డైలాగులు పేలుస్తున్నారంట కొందరు టీడీపీ ఇన్ చార్జ్ లు! చంద్రబాబు పద్దతులు ఇంతకాలం చూసి చూసి అలసిపోయిన సీనియర్ ఇన్ చార్జ్ లు అయితే.. ఆఫ్ లైన్ లోకి వెళ్ళిపోతున్నారంట. అసలు అలా ఎందుకు జరుగుతుంది.. ఇందులు బాబు చేసిన నేరమేమిటి.. అన్నది ఇప్పుడు చూద్దాం!

కరోనా సమయంలో మరీ రోజంగా ఇంట్లో అలా కూర్చుని టీవీ చూస్తూ ఉంటే బోర్ గా ఉంటుంది.. ఏదో ఒక వ్యాపకం ఉండాలని భావించారో ఏమో కానీ.. జూం మీటింగులు పెట్టాలని నిర్ణయించుకున్నారు చంద్రబాబు. అనుకున్నదే తడవుగా మహానాడు నుంచి మొదలు వితౌట్ గ్యాప్ ప్రతీ మంగళవారమూ జూం లో ఇన్ చార్జ్ లు, పార్టీ కార్యాలయాలు చూసుకునే వారు అందరూ కలిసి మొత్తంగా 250 మందిని సెలక్ట్ చేశారు చంద్రబాబు. దీంతో ప్రతీ మంగళవారం బాబు మీటింగ్ పెట్టడం.. నాయకులకు హోం వర్క్ లు ఇవ్వడం మామూలైపోయిందంట!

దీంతో ఏమైందో ఏమో తెలియదు కానీ… రాను రానూ అటిండెన్స్ మరీ పడిపోతుందంట. బాబు సెలక్ట్ చేసినవారిలో కనీసం 30శాతం హాజరుకూడా ఉండటం లేదంట. దీంతో బాబు మంగళవారం మీటింగులకు గైర్హాజరవుతున్న ఇన్ చార్జ్ లను “ఎందుకయ్యా” అని అడిగినవారికి… మా వల్లకాదు బాబు ఆ మంగళవారం మాటలు అని సమాధానం చెబుతున్నారంట! బాబు – లోకేష్ లు మాత్రం హాయిగా హైదరాబాద్ లో కూర్చుని చెబుతున్నారు.. మమ్మల్ని గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి ధర్నాలు దీక్షలు చేయాలంటున్నారు.. పోలీసులేమో కేసులుపెడుతున్నారు.. అని వాపోతున్నారంట!

మరి బాబు కూడా ఈ కరోనా సమయంలో కాస్త కనికరించొచ్చు కదా! ఆయనది ఆయన సుపుత్రుడివి మాత్రమే ప్రాణాలా.. మిగిలినవారికి కరోనా భయాలు, కేసుల భయాలూ ఉండవా? బాబు గారు కాస్త ఆలోచిస్తే మంచిది అని అంటున్నారట తమ్ముళ్లు! మరి బాబు గారు వింటారా లేక మళ్లీ మంగళవారం రెడీ అయిపోతారా అన్నది వేచి చూడాలి!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version