తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనకు సంబంధించి ఇప్పుడు కాస్త టీడీపీ గట్టి ఆరోపణలు చేస్తుంది. తాజాగా టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు జి.నరసింహయాదవ్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతి రుయా మృతుల వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు అని నిలదీశారు. 24 గంటలు గడుస్తున్నా 11 మంది పేర్లు చెప్పలేరా? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదకొండు మంది మృతి చెందారని తడబడుతూ చెప్పారు అని విమర్శించారు.
ఘటన జరిగిన 12 గంటల తర్వాత ముఖ్యమంత్రి స్పందిస్తారా? అని ఆయన నిలదీశారు. తెదేపా నిజనిర్ధారణ కమిటీ ని ఆసుపత్రిలోని కి ఎందుకు రానివ్వలేదు అని ఆయన ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జితో జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలి అని కోరారు. మృతుల వివరాలను, మృతికి గల కారణాలను పూర్తిస్థాయి నివేదిక రూపంలో మీడియాకు విడుదల చేయాలి అని విజ్ఞప్తి చేసారు. 10 లక్షల ఎక్స్గ్రేషియాను 50 లక్షలుగా ప్రకటించాలి డిమాండ్ చేసారు.