కొత్త సీసాలో పాత సారా… తమ్ముళ్ల ఫైనల్ వర్డ్ ఇది!

-

చంద్రబాబు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో.. అదీగాక చినబాబు ప్రోత్భలంతో చేస్తున్నారో తెలియదు కానీ… తప్పుల మీద తప్పులు చేసుకుంటూపోతున్నారు. పదిమంది యువరాజకీయ నాయకులకు పాఠాలు చెప్పగల స్థాయిలో ఉన్న బాబు… కార్యకర్తలు సైతం ప్రశ్నించి దులిపేశేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు! ఇంతకూ బాబు తీసుకున్న తాజా నిర్ణయాలు ఏమిటి? అవి పార్టీని మరింతగా పాతాళానికి ఎలా తొక్కబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం!

తాజాగా పార్ల‌మెంటరీ నియోజ‌క‌వ‌ర్గాల ఇన్ చార్జిలను నియమించారు చంద్రబాబు. గడిచిన సార్వత్రిక ఎన్నికల దెబ్బలు, కరోనా సమయంలో కలిగిన కనువిప్పుల నడుమ కచ్చితంగా ఈ విషయంలో బాబు జాగ్రత్తలు తీసుకుంటారని.. యువరక్తంతో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తారని తమ్ముళ్లంతా భావించారు. కానీ బాబు మళ్లీ కొత్త సీసాలో పాత సారానే నింపారు! ఫలితంగా.. ఇంక టీడీపీని ఎవరూ కాపాడలేరు అన్న కామెంట్లకు మార్గం సుగమం చేశారు!

బాబు ఎంపిక చేసిన కొందరు ఆణిముత్యాల పేర్లు ఇప్పుడు పరిశీలిద్దాం! అనంత‌పురం ఇన్ చార్జిగా కాలువ శ్రీనివాసులు.. హిందూపురం పార్ల‌మెంట‌రీ ఇన్ చార్జిగా పార్థ‌సార‌ధి.. క‌డ‌ప జిల్లాకు మ‌ల్లెల లింగారెడ్డి, ఆర్.శ్రీనివాస్ రెడ్డి.. నంద్యాల ఇన్ చార్జిగా గౌరు వెంక‌ట‌రెడ్డి.. చిత్తూరు ఇన్ చార్జిగా పుల‌వర్తి నాని.. నెల్లూరు ఇన్ చార్జిగా కార్పొరేట‌ర్ అజీజ్.. శ్రీకాకుళం ఇన్ చార్జిగా కూన ర‌వికుమార్.. గుంటూరు ఇన్ చార్జిగ శ్రావణ్ కుమార్.. న‌ర‌సాపురం ఇన్ చార్జిగా తోట సీతారామ‌ల‌క్ష్మి, రాజ‌మండ్రి ఇన్ చార్జ్ గా జ‌వ‌హ‌ర్!!

ఈ పేర్లు చూసిన తమ్ముళ్లంతా.. ఈ పాతచింతకాయ రాజకీయాలు, నియామకాలు మారవా? అంటూ బాబుపై ఫైరవుతున్నారంట. పోనీ సీనియర్లకు గౌరవాన్ని ఇవ్వాలి అని భావిస్తే… ఒక యువకుడికి ఇన్ చార్జ్ బాధ్యతలు ఇచ్చి, సీనియర్లను వారి పర్యవేక్షకులుగా నియమించుకున్నా సరిపోతుందిగా అనేది వారి వాదన! ఇదే బ్యాచ్ తో రాబోయే ఎన్నికలకు వెళ్లాలని బాబు భావించడాన్ని ఆత్మహత్యాసదృశ్యంగా చెబుతున్నారు తమ్ముళ్లు! టీడీపీ కార్యకర్తలు ఆలోచించినట్లుగా కూడా బాబు ఎందుకు ఆలోచించలేకపోతున్నారనేది సగటు ప్రజానికం డౌట్!! సో… ఇంక టీడీపీని ఎవరూ కాపాడలేరు అనేది తమ్ముళ్ల ఫైనల్ వర్డ్!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version