Breaking : రేపు ఏపీవ్యాప్తంగా టీడీపీ నిరసనలు

-

విజయవాడ సీఐడీ కార్యాలయంలో చంద్రబాబు విచారణ కొనసాగుతోంది. దాదాపు 3 గంటలుగా చంద్రబాబును విచారిస్తున్నారు దర్యాప్తు అధికారులు. మరోవైపు కుంచనపల్లి సిట్ ఆఫీస్‌కు చంద్రబాబు కుటుంబసభ్యులు చేరుకున్నారు. సిట్ కార్యాలయానికి వచ్చిన నారా భువనేశ్వరి, లోకేష్ ను లోపలికి అనుమతిచ్చారు పోలీసులు. చంద్రబాబుతో మాట్లాడేందుకు ఫర్మిషన్ ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. శాంతియుత ర్యాలీలకు, నిరసనలు చేపట్టనున్నారు.

ఇదిలా ఉంటే.. చంద్రబాబు అరెస్ట్​ చేయడాన్ని నిరసిస్తూ కేపీహెచ్​బీ కాలనీ లోని జేఎన్​టీయూహెచ్​ కూడలి ఎన్టీఆర్​ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు శనివారం ఆందోళన చేపట్టి జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు ఉప్పల పద్మా చౌదరి, చిలుకూరి హరిచంద్, డివిజన్ సీనియర్ నాయకులు షేక్ సత్తార్, అట్లూరి దీపక్, విజయ్ ముదిరాజ్, రమాదేవి, చిరుమామిళ్ళ ఉమ, వాసిరెడ్డి లక్ష్మీనారాయణ, రామకృష్ణ మైనేని, కొల్లూరి శ్రీనివాస్, కొల్లి శేఖర్, కాకర్ల గోపికృష్ణ, కిషోర్ కొర్రపాటి, మహేష్, అల్లంనేని సాయి, సురేష్ హరి, కోటి, శ్యామ్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version