చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికం : మాజీ మంత్రి తుమ్మల

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. తుమ్మల మూడు దశాబ్దాలకు పైగా టీడీపీలో ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఆ పార్టీని వీడారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. రాజకీయ కక్షతో ఆయన పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. అసత్యాలతో చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. అరెస్ట్ సమయంలో కనీస న్యాయసూత్రాలు పాటించలేదన్నారు. మాజీ సీఎం పట్ల అమర్యాదగా ప్రవర్తించారన్నారు.

అంతకుముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండించారు ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీ నారాయణ. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువగళంతో లోకేష్, ప్రజాబలంతో చంద్రబాబు తన ప్రభుత్వ పునాదులు కదుపుతున్నారన్న భయంతో జగన్ బరితెగించాడని దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌పై జగన్ ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆయన విమర్శలు చేశారు. ప్రజల కోసం పనిచేయాల్సిన సీబీసీఐడీ, సీఐడీ ఇతర సంస్థలు జగన్ కక్ష సాధింపు వ్యవహారాల్లో మునిగి తేలుతున్నాయని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అర్ధరాత్రి వెళ్లి చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిన అసవరం ఏంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు విషయంలో దర్యాప్తు సంస్థలు పరిధి దాటి వ్యవహరించాయన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version