BREAKING : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విడుదల

-

అమరావతి : టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విడుదల అయ్యారు. అమరావతి లోని… ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి బుద్దా వెంకన్న అర్ధరాత్రి విడుదల అయ్యారు. స్టేషన్ బెయిలిచ్చి విడుదల చేశారు అమరావతి పోలీసులు. ఇక విడుదల అయిన అనంతరం టీడీపీ నేత బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు.

రేపు ఉదయం మీడియాతో అన్ని విషయాలు మాట్లాడతానని… పోలీసులు నన్ను అడిగిన విషయాలు గురించి.. నాపై కొడాలి చేసిన వ్యాఖ్యల గురించి మొత్తం వివరిస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో అస్సలు తగ్గబోనని స్పష్టం చేశారు బుద్దా వెంకన్న. దీనిపై ఎలాంటి పోరాటానికి కైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాగా.. మంత్రి కొడాలి నాని, ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పై అనుచిత వ్యాఖ్యు చేసిన వ్యవహారంలో… టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విచారణ చేసిన అనంతరం.. ఆయనను అర్ధరాత్రి విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version