ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఎన్నికయ్యాక అసెంబ్లీ లో మొట్ట మొదటి రోజు నేను కనుసైగ చేస్తే చాలు మీ పార్టీలో ఉన్న వాళ్లంతా నా పార్టీ లోకి రావటానికి రెడీగా ఉన్నారు అంటూ చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఇదిలా ఉండగా 10 నెలల తర్వాత మళ్లీ ప్రజాక్షేత్రంలో టిడిపి వైసిపి పార్టీలు మరియు ఇతర పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవటానికి రెడీ అయ్యాయి. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ పరిపాలన పట్ల అంతటా పాజిటివ్ వాతావరణం క్రియేట్ అయ్యి ఉండటంతో తెలుగుదేశం పార్టీకి చెందిన చాలా మంది నాయకులు వైసిపి తీర్థం పుచ్చుకుంటున్నారు.
కర్నూలు జిల్లాలో బలమైన నాయకుడిగా పేరొందిన ఈయన టీడీపీలో అత్యంత నమ్మకమైన నేతగా ఎదిగాడు. అయితే ఇటీవల రాజధాని విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరుకు మనస్థాపం చెంది…రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని అద్భుతంగా పరిపాలిస్తున్న వైయస్ జగన్ సిగ్నల్ కోసం ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారు. టీడీపీకి రాజీనామా చేసి అటూ ఇటూ కాకుండా గోడ మీద కూర్చున్న బీసీ జనార్దన్ రెడ్డి…జగన్ కనుసైగ చేస్తే పార్టీలోకి రావటానికి మొత్తం సిద్ధం చేసుకున్నారు. దీంతో చంద్రబాబుకు అత్యంత క్లోజ్ అయినా బీసీ జనార్దన్ రెడ్డి పార్టీ మారడానికి రెడీ అవటంతో ప్రస్తుతం ఈ వార్త ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.